Sports

క్రికెట్‌లో ఔట్స్ రకాలు – సమగ్ర విశ్లేషణ

క్రికెట్‌లో ఔట్స్ రకాలు (types of out in cricket) అంటే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది క్యాచ్ ఔట్, క్లీన్ బౌల్డ్, LBW మరియు రన్ అవుట్, స్టంప్ అవుట్. వీటలో క్రికెట్ మ్యాచ్స్‌లో ఎక్కువగా క్యాచ్ ఔట్, LBW, క్లీన్ బౌల్డ్. రన్ అవుట్, స్టంప్ అవుట్ అనేవి మ్యాచ్స్‌లో తక్కువగా జరుగుతాయి. అయితే, క్రికెట్‌లో మొత్తం 10 రకాల ఔట్స్ ఉంటాయనే విషయం మీకు తెలుసా? దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ తప్పకుండా చదవాలి.

క్రికెట్‌లో ఎన్ని రకాల ఔట్స్ ఉంటాయి

క్రికెట్‌లో ఔట్స్ రకాలు (types of out in cricket) అనగానే త్వరగా మీకు తెలిసిన క్యాచ్ ఔట్, క్లీన్ బౌల్డ్, LBW , స్టంప్ అవుట్, రన్ అవుట్ అన్ని ఠక్కున సమాధానం చెప్తారు. అయితే, మీరు తప్పులో కాలేసినట్లే అవుతుంది. ఎందుకంటే, ఈ ఐదు ఔట్స్‌తో పాటు మరొక 5 ఔట్స్ కూడా క్రికెట్ ప్రపంచంలో ఉన్నాయి. ఇప్పుడు వివిధ రకాల ఔట్స్ గురించి తెలుసుకుందాం.

క్రికెట్‌లో ఔట్స్ రకాలు – క్లీన్ బౌల్డ్, క్యాచ్ ఔట్

క్రికెట్‌లో ఔట్స్ రకాలు (types of out in cricket) అంటే మనకు త్వరగా గుర్తుకు వచ్చేది క్లీన్ బౌల్డ్. ఎందుకుంటే, ఇది బౌలర్ బాల్ వేసిన తర్వాత బాల్ బ్యాట్ దాటుకుని నేరుగా వికెట్లకు తాకుతుంది. రెప్ప పాటు సమయంలోనే వికెట్లు నేలకు పడిపోవడం, బెల్స్ ఎగిరిపోవడం జరుగుతాయి. వీటిని చూసి బౌలర్, మిగతా టీం ప్లేయర్లతో పాటు స్టేడియం మొత్తం ఆనందంలో మునిగిపోతుంది. క్లీన్ బౌల్డ్ అనేది బౌలర్లకు చాలా కిక్ ఇచ్చే ఔట్.

క్రికెట్ ఔట్స్ రకాల్లో క్యాచ్ అవుట్ అందరికీ తెలిసిందే. బ్యాట్స్‌మెన్ బాల్ కొట్టినప్పుడు అది గాలిలో ఉండగా గ్రౌండ్‌లో ఉన్న అందరికీ ఉత్కంఠగా ఉంటుంది. ఫీల్డర్స్, బౌలర్, కీపర్ క్యాచ్ పట్టుకుంటే సంతోషమే. క్యాచ్ వదిలేస్తే మాత్రం చాలా బాధగా ఉంటుంది. క్యాచ్ ఔట్స్‌ను మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ అని కూడా అనొచ్చు.

క్రికెట్‌లో 10 రకాల ఔట్స్ – పూర్తి వివరాలు

క్రికెట్‌లో ఔట్స్ రకాలు (types of out in cricket) 10 ఉంటాయని ఇప్పడు అందరికీ తెలిసింది. అయితే, ప్రతి ఔట్‌ను ఎలా ప్రకటిస్తారు మరియు వాటి విధి విధానాల గురించి కూడా తెలుసుకోండి.

లెగ్ బిఫోర్ వికెట్ (LBW)

క్రికెట్‌లో ఔట్స్ రకాలు (types of out in cricket) చూస్తే, లెగ్ బిఫోర్ వికెట్ అంటే LBW అని షార్ట్ ఫాంలో అంటారు. బౌలర్ వేసిన బాల్ స్టంప్స్ తాకడానికి వెళ్లేటప్పుడు, బ్యాట్స్‌మెన్ బ్యాట్ కాకుండా కాళ్లు, ఛాతీ, భుజం మరియు తలను ఉపయోగించి ఆపినప్పుడు LBW ఔట్ అవుతాడు. అయితే, బ్యాట్‌కు తాకిన తర్వాత శరీరంలోని ఈ భాగాలకు తాకితే ఔట్ కాదు. స్టంప్స్ కొట్టే బాల్ నేరుగా శరీరంలోని ఈ భాగాలకు ద్వారా ఆపబడితేనే ఔట్ అవుతుంది. ఇందులో బాల్ కూడా నేరుగా పిచ్ లోపల నుంచే వెళ్లాలి.

స్టంప్ అవుట్

క్రికెట్‌లో ఔట్స్ రకాలు (types of out in cricket) : స్టంప్ అవుట్ గురించి కూడా దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. బాల్ కొట్టడానికి బ్యాట్స్‌మెన్ క్రీజు నుంచి బయటకు వచ్చిన తర్వాత, బాల్ మిస్ అయి కీపర్ చేతిలోకి వెళ్తుంది. అప్పుడు రెప్ప పాటు సమయంలో వెనకాల ఉన్న కీపర్ వికెట్లను బాల్‌తో కొటినా లేదా తాకించినా బ్యాట్స్‌మెన్ ఔట్ అవుతాడు. అయితే, వికెట్లను తాకించే సమయంలో కీపర్ చేతిలో ఖచ్చితంగా బాల్ ఉండాలి.

రన్ ఔట్

బాల్ కొట్టిన తర్వాత రన్ తీసే సమయంలో బ్యాట్స్‌మెన్ క్రీజులోకి చేరక ముందే బౌలర్, కీపర్, ఫీల్డర్స్ బంతితో వికెట్లను కొడితే రన్ ఔట్ అవుతుంది. రన్ ఔట్‌లో ఫీల్డర్ నేరుగా వికెట్లను కొట్టినా లేదా బౌలర్ మరియు కీపర్‌కు బాల్ ఇచ్చిన తర్వాత, వారు వికెట్లను కొట్టినా ఔట్ కిందే లెక్కిస్తారు.

రన్ ఔట్ (మాన్కడింగ్)

క్రికెట్‌లో ఔట్స్ రకాలు (types of out in cricket) : మాన్కడింగ్ అంటే మరొక రకమైన రనౌట్ లాంటిది. అయితే, ఇది బౌలర్ చేతిలో ఉంటుంది మరియు బౌలింగ్ వైపు క్రీజులో ఉండే బ్యాట్స్‌మెన్ ఔట్‌కు సంబంధించినది. సాధారణంగా బౌలర్ బాల్ వేసిన తర్వాత, బంతి చేతి నుంచి దాటిన తర్వాత మాత్రమే బౌలర్ ఎండ్ వైపు బ్యాట్స్‌మెన్ క్రీజులో నుంచి బయటకు రావాలి. ఒక వేళ ముందే వస్తే, బౌలర్ మాన్కడింగ్ చేయొచ్చు. అయితే, దీనిపై ఇప్పటికీ కొంత వివాదం నడుస్తుంది.

హిట్ వికెట్

హిట్ వికెట్ అంటే, స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్ మెన్ తన కాళ్లతో గానీ, బ్యాటుతో కానీ పొరపాటున వికెట్లను తాకితే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. ఇందులో మరొక విషయం ఏమిటంటే, స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ హెల్మెట్ పొరపాటున వికెట్స్ మీద పడినా హిట్ వికెట్‌గా పరిగణిస్తారు.

బంతిని చేత్తో ఆపడం

బౌలర్ వేసిన బంతిని బ్యాట్‌తో కొట్టిన తర్వాత, అది వికెట్ల వైపు వెళ్లే సమయంలో చేతితో ఆపే ప్రయత్నం చేసినా మరియు ఫీల్డర్ సమ్మతి లేకుండా బంతిని బ్యాట్ లేదా శరీరం ఉపయోగించి బాల్ ఫీల్డర్‌కు ఇచ్చినా ఈ నిబంధన ప్రకారం ఔట్ అవుతారు.

ఫీల్డింగ్ అడ్డుకోవడం

మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న వారిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నా, క్యాచ్ పట్టే సమయంలో నేరుగా అంతరాయం కలిగించినా ఈ నిబంధన ప్రకారం ఔట్ అవుతారు.

బంతిని రెండు సార్తు కొట్టడం

బ్యాట్స్‌మెన్ ఒక సారి బాల్ కొట్టిన తర్వాత, బౌండరీకి తరలించడానికి మరొక సారి కొట్టనా ఔట్ అవుతాడు. అలాగే, ఒక సారి బంతిని కొట్టిన తర్వాత వికెట్ల వైపు పోయే బాల్‌ను కొట్టినా కూడా అవుట్ కింద పరిగణిస్తారు.

క్రికెట్‌లో ఔట్స్ రకాలు – నో బాల్ గురించి వివరణ

క్రికెట్‌లో ఔట్స్ రకాలు (types of out in cricket) చెప్పగానే మీకు కొన్ని సందేహాలు వస్తాయి. అందులో ముఖ్యమైనది ఏమిటంటే, నో బాల్ వేసినప్పుడు వేటిని ఔట్స్‌గా ప్రకటిస్తారు? నో బాల్ వేసినప్పుడు క్లీన్ బౌల్డ్ అయినా, క్యాచ్ అవుట్ అయినా, LBW, స్టంప్ అవుట్ అయినా.. నాటౌట్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే, నోబాల్ అనేది బౌలర్ తప్పు వల్ల జరిగేది. కావున, నో బాల్ వల్ల ఔట్ అయ్యే విధానం వీటిలో లెక్కలోకి రాదు. అలాగే, రన్ ఔట్, రన్ ఔట్ (మాన్కడింగ్), హిట్ వికెట్, బంతిని చేత్తో ఆపడం, ఫీల్డింగ్ అడ్డుకోవడం, టైం ఔట్ అనేవి నో బాల్‌తో సంబంధం లేకుండా ఉంటాయి. నో బాల్‌తో సంబంధం లేకుండా వీటిని పరిగణిస్తారు.

చివరగా, క్రికెట్‌లో ఔట్స్ రకాలు (types of out in cricket) గురించి ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి విషయాలు తెలుసుకున్నారని మేం ఆశిస్తున్నాం. మీరు ఇలాంటి మరిన్ని క్రీడలకు సంబం

ధించిన విషయాల కోసం ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Yolo247 సంప్రదించండి.

క్రికెట్‌లో ఔట్స్ రకాలు (Types Of Out In Cricket) – (FAQ’s)

 1: క్రికెట్‌లో ఉంటే 10 ఔట్స్ రకాలు ఏమిటి?

A: క్లీన్ బౌల్డ్, క్యాచ్ ఔట్, లెగ్ బిఫోర్ వికెట్ (LBW), స్టంప్ ఔట్, రన్ ఔట్, రన్ ఔట్(మాన్కడింగ్), హిట్ వికెట్, బంతిని చేత్తో ఆపడం, ఫీల్డింగ్ అడ్డుకోవడం, బంతిని రెండు సార్తు కొట్టడం మొదలైనవి.


2: క్రికెట్‌లో టైం అవుట్ అంటే ఏమిటి?

A: బ్యాట్స్‌మెన్ ఔట్ అయిన తర్వాత లేదా రిటైర్డ్ హర్ట్ అయిన తర్వాత వచ్చే ఇన్‌కమింగ్ బ్యాట్స్‌మెన్‌కు తదుపరి బంతిని ఆడటానికి మూడు నిమిషాలు సమయం మాత్రమే ఇస్తారు. ఆ లోపు రాకపోతే ఔట్ కింద పరిగణిస్తారు.


3: మాన్కడింగ్ గురించి వివరించండి?

A: సాధారణంగా బౌలర్ బాల్ వేసిన తర్వాత, బంతి చేతి నుంచి దాటిన తర్వాత మాత్రమే బౌలర్ ఎండ్ వైపు బ్యాట్స్‌మెన్ క్రీజులో నుంచి బయటకు రావాలి. ఒక వేళ ముందే వస్తే, బౌలర్ మాన్కడింగ్ చేయొచ్చు. అయితే, దీనిపై ఇప్పటికీ కొంత వివాదం నడుస్తుంది.


Aashish Upadhyay

Recent Posts

భారత్ vs బంగ్లాదేశ్ హెడ్ టు హెడ్ మ్యాచులు – వన్డే వరల్డ్ కప్‌ (India vs Bangladesh head to head in Telugu)

(India vs Bangladesh head to head in Telugu) ప్రపంచ కప్‌లో కొన్ని రికార్డులు ఉన్నాయి, వాటి గురించి మీకు ముందే తెలుసుకుంటే, మ్యాచ్‌ని ఎవరు… Read More

2 సంవత్సరాలు ago

వన్డే వరల్డ్ కప్‌‌లో ఎక్కువ స్కోర్లు సాధించిన జట్లు (Highest team score in odi world cup in Telugu)

క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో (Highest team score in odi world cup in Telugu) అత్యధిక జట్టు స్కోరును పరిశీలిస్తే, క్రికెట్ లో భారత్… Read More

2 సంవత్సరాలు ago

తక్కువ స్కోర్స్ చేసిన టీమ్స్ – వన్డే ప్రపంచ కప్‌ (Lowest team score in world cup in Telugu)

(Lowest team score in world cup in Telugu) ODI క్రికెట్ ప్రపంచ కప్‌లో అత్యల్ప స్కోరు - ICC క్రికెట్ ప్రపంచ కప్, ఒక… Read More

2 సంవత్సరాలు ago

భారతదేశం vs పాకిస్తాన్ హెడ్ టు హెడ్ మ్యాచ్‌లు – వన్డే వరల్డ్ కప్‌ (Head to Head IND vs PAK in Telugu)

(Head to Head IND vs PAK in Telugu) క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ చూడాలని అందరూ కోరుకుంటారు. కానీ అది ప్రపంచకప్ మ్యాచ్ అయినప్పుడు… Read More

2 సంవత్సరాలు ago

:వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక డకౌట్లు అయిన బ్యాట్స్‌మెన్ (Most ducks in world cup in Telugu)

(Most ducks in world cup in Telugu) క్రికెట్‌లో ఎప్పుడూ మంచి రికార్డుల గురించి మాట్లాడుకునే చరిత్ర ఉంది. కానీ ఆటగాళ్ళు తమ పేరుతో అనుబంధించబడకూడదనుకునే… Read More

2 సంవత్సరాలు ago

విజయవంతమైన వికెట్ కీపర్స్ – వన్డే ప్రపంచ కప్ (Most Successful Wicket Keeper in World Cup History in Telugu)

(Most Successful Wicket Keeper in World Cup History in Telugu) ప్రపంచ కప్ 2023 ప్రారంభమైంది మరియు ప్రపంచ కప్ యొక్క అనేక రికార్డుల… Read More

2 సంవత్సరాలు ago